Skip to main content

సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీతో వీఐటీ–ఏపీ ఒప్పందం

హైదరాబాద్‌: సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీతో వీఐటీ–ఏపీ స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ విభాగం విద్య, పరిశోధనా రంగాల్లో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ–ఆంధ్రప్రదేశ్‌ (వీఐటీ–ఏపీ) ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ఒప్పందం అధ్యాపకులు, విద్యార్థులు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలు చేసే అవకాశం పొందడానికి సహాయపడుతుందని పేర్కొంది. దీని సహకారంతో విద్యార్థులు, అధ్యాపకులు పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో నిధుల కోసం ప్రాజెక్టు ప్రతిపాదనలను వివిధ ఏజెన్సీలు, పరిశ్రమలకు సమరి్పంచవచ్చని వివరించింది.
Published date : 12 Apr 2021 04:52PM

Photo Stories