Skip to main content

IITH: ఎమ్మెస్సీ మెడికల్‌ ఫిజిక్స్‌ కోర్సు

సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీలో నూతనంగా ఎమ్మెస్సీ మెడికల్‌ ఫిజిక్స్‌ కోర్సు ప్రారంభమైంది.
IITH
ఐఐటీ హైదరాబాద్ లో ఎమ్మెస్సీ మెడికల్‌ ఫిజిక్స్‌ కోర్సు

బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్‌ ఐఐటీ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుందని ఐఐటీ హైదరాబాద్‌ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టు గా బీఎస్సీ పూర్తి చేసినవారు ఈ కోర్సు కు అర్హులు. మూడేళ్ల ఈ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు నేరుగా ఐఐటీహెచ్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. డిగ్రీలో వచ్చిన మార్కులు, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు.

చదవండి:

Published date : 05 Aug 2022 01:39PM

Photo Stories