ఐఐటీ హైదరాబాద్‌లో జీవన్‌లైట్ వెంటిలేటర్ రూపకల్పన
ఇటీవల తక్కువ ఖర్చుతో తయారయ్యే ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ను డిజైన్ చేసిన ఐఐటీ హైదరాబాద్.. తాజాగా ‘జీవన్‌లైట్’ పేరుతో అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్‌ను తయారు చేసింది. ఐఐటీ అనుబంధ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్‌హెచ్‌ఈ)కి చెందిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్స్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వెంటిలేటర్‌ను రూపొందించింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నట్లు ఏరోబయోసిస్ చెబుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పనిచేసే ఈ వెంటిలేటర్ ను విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ బ్యాటరీ ద్వారా వాడొచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీవన్‌లైట్ పేరుతో వెంటిలేటర్ రూపకల్పన
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : ఐఐటీ హైదరాబాద్
ఎందుకు : కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు