ఉద్యోగంతో కూడిన ఎంఎస్ కోర్సులు
Sakshi Education
రాష్ట్ర విద్యార్థులకు ఉద్యోగంతో కూడిన ఎంఎస్ కోర్సులను అందించేలా జర్మనీ దేశానికి చెందిన ఎస్జీఐటీ స్టీన్బీస్ వర్సిటీతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సెప్టెంబర్ 26న ఒప్పందం చేసుకుంది.
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి సమక్షంలో కార్యదర్శి నజీర్ అహమ్మద్, ఎస్జీఐటీ స్టీన్బీస్ వర్సిటీ డైరెక్టర్ బెట్రమ్ లోహ్మూర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్ర విద్యార్థులకు ఉన్నత ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని హేమచంద్రారెడ్డి తెలిపారు. బెట్రమ్ లోహ్మూర్ మాట్లాడుతూ రానున్న నాలుగేళ్లలో బాష్ వంటి కంపెనీలకు 5 లక్షల మంది అభ్యర్థులు అవసరం అవుతారని చెప్పారు.
చదవండి:
Education: విద్యాభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ అద్భుతం
AP EAPCET 2022: ‘బీ’ కేటగిరీ సీట్లు ముందే భర్తీ చేయొద్దు
Jobs: ఈ మూడేళ్లలో రాష్ట్రంలో రెట్టింపైన జాబ్ ప్లేస్‌మెంట్స్
Published date : 27 Sep 2022 01:53PM