తిరుపతిలో మరో కొత్త యూనివర్సిటీ
ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు జనవరి 13న అనుమతి ఉత్తర్వులు (జీఓ నెంబర్–2) జారీ చేశారు. మోహన్ బాబు 1996 నుంచే తాను చైర్మన్ గా చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో శ్రీశాంతినగర్‌లో శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహిస్తున్నారు. బీటెక్, ఎంటెక్‌తో పాటు పాలిటెక్నిక్ డిపొ్లమో కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. జేఎన్ టీయూ అనంతపురానికి అఫ్లియేషన్ తో కొనసాగిన ఈ విద్యా సంస్థకు 2010–11 నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్) వచ్చింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ఇందుకు ఉన్నత విద్యా శాఖ అనుమతించింది.
చదవండి:
Good News: ఇంజనీరింగ్ కాలేజీకి యూనివర్సిటీ హోదా
ATL 2021: స్పేస్ చాలెంజ్ లో గురుకుల విద్యార్థుల ప్రతిభ.. విజేతల వివరాలు..