Good News: ఇంజనీరింగ్ కాలేజీకి యూనివర్సిటీ హోదా
ఉత్తరాంధ్ర ప్రజలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాంకేతిక వర్సిటీని ఏర్పాటు చేసింది. విజయనగరంలోని జేఎన్ టీయూ–కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీకి పూర్తి స్థాయి యూనివర్సిటీ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం జనవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లూ ఇది జేఎన్ టీయూ–కాకినాడకు అనుబంధంగా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చొరవతో ఇప్పుడు జేఎన్ టీయూ గురజాడ, విజయనగరం (జేఎన్ టీయూ–జీవీ) వర్సిటీగా అవతరించింది. రాష్ట్ర వర్సిటీల చట్టాన్ని సవరించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకు ఈ కళాశాలను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేస్తే, ఇప్పుడు వైఎస్ జగన్.. సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు పేరుతో వర్సిటీని నెలకొల్పి ఉత్తరాంధ్ర ప్రతిష్టను ఇనుమడింపజేశారు. ప్రస్తుతం ఇక్కడ ఏడు ఇంజనీరింగ్ కోర్సులతో ఏడాదికి 420 మంది బీటెక్ విద్యార్థులు పట్టభద్రులవుతున్నారు.
చదవండి:
ATL 2021: స్పేస్ చాలెంజ్ లో గురుకుల విద్యార్థుల ప్రతిభ.. విజేతల వివరాలు..
Wipro: పోటీల్లో మన విద్యార్థుల సత్తా