Jobs: ఐటీకి నిపుణుల కొరత..: విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్
‘మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నిపుణులను నియమించుకోవడం, ఉన్నవారిని కాపాడుకోవడం కోసం పరిశ్రమవ్యాప్తంగా కంపెనీలు ఎన్నో అంచల కృషి చేస్తున్నట్టు చెప్పారు. హైబ్రిడ్ పని నమూనా (ఎక్కడి నుంచి అయినా పనిచేయించుకోవడం) ఇక ముందూ కొనసాగుతుందన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో భిన్న పరిశ్రమలు దీనిపై ప్రయోగాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పరిశ్రమలో వివిధ స్థాయిల్లో సిబ్బందికి నైపుణ్యం పెంపు, తిరిగి నైపుణ్యాల కల్పనపై శిక్షణ కోసం అసాధారణ సమయం వెచ్చిస్తున్నట్టు వివరించారు. ‘‘కంపెనీలు ఉన్న నిపుణులను అట్టిపెట్టుకోవడం కోసం అసాధారణ స్థాయిలో కృషి చేస్తున్నాయి. ఉద్యోగులు కేవలం మెరుగైన వేతనం కోసమో లేదా మెరుగైన అవకాశాల కోసమో కంపెనీని వీడతారని అనుకోవడం లేదు. సంస్థతో తనకు అనుసంధానత లేదనుకున్నప్పుడే వెళ్లిపోతారు’’ అని రిషద్ చెప్పారు. సంస్థలో తాను భాగమేనని, సంస్థతోపాటు తాను కూడా వృద్ధి చెందుతానన్న భావన వారిలో కలి్పంచడం కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. శరవేగంగా వృద్ధి సాధిస్తున్న స్టార్టప్ రంగానికి ఐటీ రంగం నిపుణులను కోల్పోతోందా? అన్న ప్రశ్నకు.. నిపుణుల కొరత ప్రపంచం అంతటా ఉన్నదేననన్నారు.
చదవండి: