Skip to main content

NIRF Ranking : ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో జేఎన్‌టీయూకే ఈ స్థానాల్లో ర్యాంకు సాధించాలి

జేఎన్‌టీయూకే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో తొలి పది స్ధానాల్లో ర్యాంకింగ్‌ సాధించేలా కృషి చేస్తామని యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ మురళీకృష్ణ తెలిపారు.
JNTUA should achieve top 10 in nirf ranking

బాలాజీచెరువు: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో జేఎన్‌టీయూకే తొలి పది స్ధానాల్లో ర్యాంకింగ్‌ సాధించేలా కృషి చేస్తామని యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ మురళీకృష్ణ తెలిపారు. ఉన్నత విద్యా మండలి నియమించిన నిపుణుల కమిటీ శుక్రవారం వీసీ మురళీకృష్ణతో సమావేశమైంది. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ, ప్రతి విశ్వవిద్యాలయానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారని, అందులో భాగంగా జేఎన్‌టీయూకే వర్సిటీకి అన్నా యూనివర్సిటీ ఐక్యూఏసీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గుణశేఖరన్‌, వెల్లూరు విట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మురుగన్‌తో కమిటీ ఏర్పాటైందన్నారు.

DSC Free Coaching: డీఎస్సీ ఉచిత శిక్షణ పరీక్ష వాయిదా

యూనివర్సిటీలో రెగ్యులర్‌ అధ్యాపకులకు పూర్తి స్థాయి రీసెర్చ్‌ స్కాలర్స్‌ కేటాయిస్తామని, విదేశీ విద్యార్థుల ప్రవేశాలు మెరుగుపర్చడంతో పాటు, టెక్‌, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. ఫ్యాకల్టీ స్టూడెంట్‌ రేషియో(ఎఫ్‌ఎస్‌ఆర్‌)ను పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. ఎన్‌ఎఫ్‌ఆర్‌ఐలో ఉత్తమ ర్యాంక్‌ సాధించేందుకు యూనివర్సిటీ నుంచి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం యూనివర్సిటీలో మౌలిక వసతులు, ఇంజినీరింగ్‌ విభాగాలు, ప్రయోగశాలలు తదితర వాటిని కమిటీ సభ్యులు పరిశీలించి, పలు సూచనలు చేశారు. రెక్టార్‌ కేవీ రమణ, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ రవీంద్ర, డీఏఏ ఏసురత్నం, అడ్మిషన్ల డైరెక్టర్‌ ప్రసాద్‌, ఐక్యూఏసీ డైరెక్టర్‌ కృష్ణప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ మోహనరావు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 11 Nov 2024 10:06AM

Photo Stories