Skip to main content

Vice Chancellor Posts: వీసీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

తిరుపతి సిటీ: జిల్లాలోని యూనివర్సిటీలకు పూర్తిస్థాయి వైస్‌ చాన్సలర్లను నియమించేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు సెప్టెంబర్ 9న‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.
Notification release for VC posts news in telugu  Notification for full-time Vice Chancellor appointment at SVU  Padmavathi Mahila Varsity Vice Chancellor recruitment notification Application deadline for Vice Chancellor positions at SVU, Padmavathi Mahila Varsity, and Kuppam Dravidian University

జిల్లాలోని ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీతో పాటు కుప్పం ద్రావిడియన్‌ యూనివర్సిటీలకు సంబంధించి ఆసక్తి, అర్హత గల వారు సెప్టెంబర్ 28వ తేదీలోపు ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దీంతో ఆశావాహులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకుని, లాబీయింగ్‌ల కోసం తమ అస్త్రశస్త్రాలను ఉపయోగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా అధికార టీడీపీ, జనసేన పార్టీల అనుచరులుగా ముద్రపడిన ప్రొఫెసర్లు, రిటైర్డ్‌ అధ్యాపకులు తమ సన్నిహితులతో చర్చలు ప్రారంభించారు.

చదవండి: PhD Admissions: పీహెచ్‌డీ ప్రవేశాలు.. 'నెట్‌' పరిధిలో చేర్చొద్దంటూ వర్సిటీల నిర్ణయం

తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారంటూ టీడీపీ అనుచరులు.. ఈ దఫా తమ సామాజిక వర్గానికే వీసీ పోస్టు దక్కుతుందంటూ జనసేన పార్టీ వారు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు.

ఈ ఏడాది సుమారు ఒక్కో వర్సిటీ నుంచి ఆశావాహులు సుమారు 10 నుంచి 15మంది వరకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీసీల నియామకం ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోందని వర్సిటీలలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

Published date : 11 Sep 2024 09:26AM

Photo Stories