Imtiaz: ఏఎన్ యూలో మైనార్టీస్ స్టడీస్‌కు చర్యలు
Sakshi Education
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మైనార్టీస్ స్టడీస్‌కు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఇంతియాజ్ అన్నారు.
విజయవాడలోని తన కార్యాలయంలో ముస్లిం ప్రతినిధులు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన మార్చి 3న సమావేశం నిర్వహించారు. ఏఎన్ యూ పాలకవర్గ సభ్యుడు డాక్టర్ మస్తాన్ వలీ మాట్లాడుతూ.. వర్సిటీలో 2022–2023 విద్యా సంవత్సరంలో ఉర్దూ డిపార్టుమెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ముస్లిం జేఏసీ కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం ఎడ్యుకేషన్, వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి డాక్టర్ ఇస్సార్ అహ్మద్ మాట్లాడుతూ.. అరబిక్, పర్షియన్ తదితర భాషలను ప్రవేశపెట్టాలన్నారు.
చదవండి:
Published date : 04 Mar 2022 03:15PM