Skip to main content

ANU: ఏఎన్‌యూకి ర్యాంకింగ్స్‌ ఆఫ్‌

ANU ranked best in GS of Universities
ANU ranked best in GS of Universities
  • యూనివర్సిటీస్‌ ఇన్‌ ఇండియా ర్యాంకు 

ఏఎన్‌యూ: స్పెయిన్‌కు చెందిన ర్యాంకింగ్‌ సంస్థ గురువారం 2022వ సంవత్సరానికి ప్రకటించిన ర్యాకింగ్స్‌ ఆఫ్‌ యూనివర్సిటీస్‌ ఇన్‌ ఇండియా–2022లో ఏఎన్‌యూ ఉత్తమ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకుల్లో ఏఎన్‌యూ జాతీయ స్థాయిలో 62వ ర్యాంకును, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. స్పెయిన్‌కు చెందిన ఈ సంస్థ ఆయా యూనివర్సిటీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పొందిన ర్యాంకులను ప్రామాణికంగా తీసుకుని ఈ ర్యాంకులను ఖరారు చేసింది. దీనిలో భాగంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ తదితర సంస్థల నుంచి ఏఎన్‌యూ పొందిన ర్యాంకుల ఆధారంగా ఏఎన్‌యూ స్థానాన్ని ఖరారు చేసింది. ఏఎన్‌యూ ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్‌ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజి్రస్టార్‌ డాక్టర్‌ బి.కరుణ, యూనివర్సిటీ ఆన్‌లైన్‌ ర్యాకింగ్స్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బీహెచ్‌ నాగకిషోర్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ర్యాంకుల స్ఫూర్తితో త్వరలో యూనివర్సిటీకి నాక్‌లో అత్యుత్తమ గ్రేడ్‌ సాధించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని వారు సూచించారు.
 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 18 Feb 2022 03:04PM

Photo Stories