Skip to main content

World University Rankings: ఏఎన్‌యూకి టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకు

ఏఎన్‌యూ: లండన్‌కు చెందిన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ 2024వ సంవత్సరానికి వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకులను విడుదల చేసింది.
World University Rankings
ఏఎన్‌యూకి టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 58వ ర్యాంకు, అంతర్జాతీయ స్థాయిలో ఓవరాల్‌ కేటగిరీలో 1201–1500 విభాగంలో ర్యాంకును, బోధనలో 207వ ర్యాంకును సొంతం చేసుకుంది. యూనివర్సిటీలలో ఉన్న బోధన, పరిశోధన, అంతర్జాతీయ సంబంధాలు, పరిశ్రమలతో అనుసంధానం వంటి అంశాల ప్రాతిపదికన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఈ ర్యాంకులను జారీ చేసింది.

చదవండి: THE World University Rankings 2024: రికార్డు స్థాయిలో మ‌న‌ విశ్వవిద్యాలయాలు... భారత్ కు నాలుగవ స్థానం!!

ప్రపంచ వ్యాప్తంగా 1904 యూనివర్సిటీలు ఈ ర్యాంకులు పొందాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీలో సెప్టెంబ‌ర్ 27న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో ఏఎన్‌యూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  మంచి ర్యాంకును సొంతం చేసుకోవడం అభినందనీయమన్నారు. 

Published date : 28 Sep 2023 03:09PM

Photo Stories