Skip to main content

NIMS: ఎంహెచ్‌ఎం కోర్సు

Nizam Institute of Medical Sciences(NIMS)లో ప్రతిష్టాత్మకంగా Master in Hospital Management(MHM) కోర్సును నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ నిమ్మ సత్యనారాయణ తెలిపారు.
NIMS
నిమ్స్ ఎంహెచ్‌ఎం కోర్సు

రెండేళ్లు కాలపరిమితి కలిగిన ఈ కోర్సులకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. 2022 డిసెంబర్‌31 నాటికి 30 సంవత్సరాల వయస్సు మించరాదన్నారు. ఈ కోర్సు పూర్తి చేస్తే వైద్య రంగంతో పాటుగా బీమా రంగంలో కూడా ఉపాధి అవకాశాలు అధికంగా ఉ­న్నాయని ఆగస్టు 29న మీడియాతో తెలిపారు. ఎంహెచ్‌ఎం కోర్సు పూర్తయిన తర్వాత ఆస్పత్రిలోనే ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 10లోగా నిమ్స్‌ వెబ్‌సైట్‌ (https://www.nims.edu.in)లో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేరుగా దరఖాస్తు చేసే అభ్య­ర్థులు సెప్టెంబరు 15లోగా పోస్టు ద్వారా కానీ, నేరుగా ఆస్పత్రిలో అందజేయాలన్నారు. ఈ కోర్సు చేసే వారికి టీఎస్‌ఆర్టీసీ బస్సు పాస్‌ సదుపాయాన్ని కూడా కల్పించిందని చెప్పారు. వివరాలకు 040–23489189, 6300991479 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. 

చదవండి: 

Published date : 30 Aug 2022 01:02PM

Photo Stories