Skip to main content

New Medical College: వైద్య విద్యకు వేళాయె..

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని మంజూర్‌నగర్‌ రామప్ప కాలనీ సమీపంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలో తరగతుల ప్రారంభానికి వేళయింది.
medical education
కళాశాలకు చేరుకుంటున్న పరికరాలు

మొదటి విడత కౌన్సెలింగ్‌లో కళాశాలలు ఎంపిక చేసుకున్న వారు ఆగ‌స్టు 26వ తేదీ వరకు కళాశాలలో సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించి అడ్మిషన్లు పొందనున్నారు. ఈ ప్రక్రియ ఆగ‌స్టు 24న‌ ప్రారంభం కాగా భూపాలపల్లి మెడికల్‌ కళాశాలకు పలువురు విద్యార్థులు వచ్చి అడ్మిషన్లు తీసుకున్నారు.

చదవండి: Admissions: మెడికల్‌ కళాశాలలో సీట్లభర్తీ షురూ

కళాశాల ప్రారంభానికి కావాల్సిన అన్ని వసతులను.. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర కోటా కింద 85 సీట్లు, ఆలిండియా కోటా కింద 15సీట్లు కేటాయించారు.

1నుంచి తరగతులు ప్రారంభం

కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆల్‌ ఇండియా కోటాలో మొదటి విడతలో నలుగురు విద్యార్థులు, రాష్ట్ర కోటాలో మొదటి రోజు నలుగురు విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మొదటి విడతలో 56మంది విద్యార్థులు భూపాలపల్లి కళాశాలను ఎంపిక చేసుకున్నారు. గడుపులోగా వారు అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉంది.

మరో రెండు విడతల్లో నిర్వహించే కౌన్సెలింగ్‌లో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ కానున్నాయి. కళాశాలకు కావాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ఏడాది ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం తరగతులు కొనసాగనున్నాయి.

చదవండి: NEET: నీట్‌ ర్యాంకు 2.38 లక్షలు..ఎంబీబీఎస్‌లో కన్వినర్‌ సీటు

వేగంగా కళాశాల నిర్మాణ పనులు

సెప్టెంబ‌ర్‌ 8వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులు మీదుగా మెడికల్‌ కళాశాల ప్రారంభించాలని, పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ భవేష్‌మిశ్రా అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. 80శాతం వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తుదిదశకు పనులు చేరుకున్నాయి. కళాశాలలో కావాల్సిన పరికరాలు కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి.

విద్యార్థులకు తాత్కాలికంగా హాస్టల్‌ వసతి కోసం కళాశాల సమీపంలోని సింగరేణి రామప్ప కాలనీలో తాత్కాలికంగా 14 క్వార్టర్లను కేటాయించారు. కళాశాలలో హాస్టల్‌ వసతి గృహాలు, అనుబంధ ఆస్పత్రి, ఇతర భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇటీవల మరో రూ.110 కోట్ల నిధులను కేటాయించింది. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారు.

అనుబంధ కళాశాలగా జిల్లా ఆస్పత్రి

జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ప్రధాన ఆస్పత్రి (100 పడకల) మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రిగా మారనుంది. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆస్పత్రి పూర్తిగా మెడికల్‌ కళాశాల పరిధిలోకి తీసుకోనున్నారు. జిల్లా ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు, డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో అంతంత మాత్రంగానే వైద్యసేవలు అందుతున్నాయి. ప్రసవాలు మాత్రమే రోజుకు పదుల సంఖ్యలో అయ్యేవి.

Dr. Manasa, DSP: APPSC Group 1 Ranker 2022 Success Story: ఎలాంటి కోచింగ్ లేకుండానే.. గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టానిలా.. నా స‌క్సెస్ ప్లాన్‌ ఇదే..

రోడ్డు ప్రమాదం బారినపడి ఆస్పత్రికి ప్రాణాపాయ స్థితిలో వస్తున్న వారు ఉంటున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో వరంగల్‌, హనుమకొండకు పరుగులు తీస్తున్నారు. వైద్య కళాశాల ఏర్పాటైతే నిపుణులైన వైద్యులతో పాటు జూనియర్‌ డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. ఒకటి రెండు సంవత్సరాల్లో ప్రస్తుతం అందుతున్న సేవలకు రెట్టింపు సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది.
నాణ్యమైన విద్య అందిస్తాం..

కళాశాలలో ఎంబీబీఎస్‌ ప్రవే శం పొందే మొదటి సంవత్సరం విద్యార్థులకు నాణ్యమై న విద్యను అందిస్తాం. కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాం. ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. కలెక్టర్‌ సహకారంతో సింగరేణి క్వార్టర్స్‌లో హాస్టల్‌ను కూడా ఏర్పాటు చేశాం. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ము గిసే వరకు అన్ని సీట్లు భర్తీ అవుతాయి. సీట్లు పొందిన విద్యార్థులు సకాలంలో అడ్మిషన్‌ చేసుకోవాలి.
– రాజ్‌డేవిడే, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

Published date : 25 Aug 2023 06:35PM

Photo Stories