Skip to main content

Admissions: మెడికల్‌ కళాశాలలో సీట్లభర్తీ షురూ

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో తెలంగాణ కోటాలో సీట్ల భర్తీ ప్రక్రియ ఆగ‌స్టు 24న‌ నుంచి ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్‌ లక్ష్మినారాయణ తెలిపారు.
Admissions
మెడికల్‌ కళాశాలలో సీట్లభర్తీ షురూ

 జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సీట్ల భర్తీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, శనివారంతో సీట్ల భర్తీ ప్రక్రియ ముగుస్తుందని అన్నారు. ఈ ఏడాది ప్రారంభించిన కళాశాలలో 100సీట్లకు 85సీట్లు రాష్ట్రకోటాలో, 15సీట్లు ఆల్‌ ఇండియా కోటాలో కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రాజస్థాన్‌ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ఒక్కరు చేరారు. ఢిల్లీకి చెందిన ఒక విద్యార్థికి ఉత్తరప్రదేశ్‌లో సీటు రావడంతో వెళ్లిపోయాడు.

చదవండి: NEET: నీట్‌ ర్యాంకు 2.38 లక్షలు..ఎంబీబీఎస్‌లో కన్వినర్‌ సీటు

ఆగ‌స్టు 24న‌ 10మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని తెలిపారు. మొట్టమొదటి విద్యార్థి కోరుట్లకు చెందిన బండారి నిత్యకు ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ అడ్మిషన్‌ఫారంను అందచేశారు. కౌన్సెలింగ్‌ కోసం విద్యార్థులు కొత్తపల్లిలోని మెడికల్‌ కళాశాలకు వెళ్తున్నట్లు తెలిసిందని, ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అడ్మిషన్‌ ప్రక్రియ చేపడుతున్నందున ఇక్కడికే రావాలని సూచించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శంతన్‌, డాక్టర్‌ కవిత, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ అగస్టీన్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి:  Medical College: కళాశాలలో అడ్మిషన్ల సందడి

Published date : 25 Aug 2023 01:22PM

Photo Stories