Skip to main content

NMC: అనురాగ్‌ ప్రైవేట్‌ వర్సిటీకి మెడికల్‌ కాలేజీ

సాక్షి, హైదరాబాద్‌: అనురాగ్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీకి మెడికల్‌ కాలేజీ మంజూరైంది. రాష్ట్రంలో ఒక ప్రైవేట్‌ యూనివర్సిటీకి అనుబంధంగా మెడికల్‌ కాలేజీ రావడం ఇదే తొలిసారి.
NMC
అనురాగ్‌ ప్రైవేట్‌ వర్సిటీకి మెడికల్‌ కాలేజీ

2023–24 వైద్య విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్‌ సీట్లు భర్తీ చేసేందుకు జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతించింది. మేడ్చల్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ కాలేజీకి నీలిమ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌గా పేరు పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలన్నీ కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ పరిధిలో ఉన్నాయి. అడ్మిషన్లు, పరీక్షలు యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే జరుగుతాయి.

చదవండి: NMC: ర్యాగింగ్‌ చేస్తే... కఠిన చర్యలు.. మార్గదర్శకాల్లోని ఇతర ముఖ్యాంశాలివీ..

కాగా, డీమ్డ్, ప్రైవేట్‌ వర్సిటీల పరిధిలోని మెడికల్‌ కాలేజీల్లో ప్రక్రియను కేంద్ర మెడికల్‌ కౌన్సిల్‌ కమిటీ (ఎంసీసీ) నిర్వహిస్తుంది. లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ఫీజుల నిర్ణయానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్ల్, డీమ్డ్‌ వర్సిటీల్లోని కాలేజీల్లో ఫీజులను అధ్యయనం చేసి, ఫీజును ఖరారు చేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే 3 ప్రైవేటు, 7 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు సహా మొత్తం 10 కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. 

చదవండి: NMC: ఈ కాలేజీలపై ఢిల్లీ నుంచి నిఘా

Published date : 04 May 2023 03:14PM

Photo Stories