Skip to main content

NMC: ర్యాగింగ్‌ చేస్తే... కఠిన చర్యలు.. మార్గదర్శకాల్లోని ఇతర ముఖ్యాంశాలివీ..

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ కాలేజీల్లో విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్‌ వంటి చర్యలకు పాల్పడరాదని.. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) హెచ్చరించింది.
NMC
ర్యాగింగ్‌ చేస్తే... కఠిన చర్యలు.. మార్గదర్శకాల్లోని ఇతర ముఖ్యాంశాలివీ..

విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని.. రోగులతో మర్యాదగా, సున్నితంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మారుతున్న వైద్య విధానాలు, సాంకేతికత, చికిత్సలపై అవగాహన పెంచుకోవాలని సూచించింది. రోగులు, వారికి సంబంధించిన సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకూడదని పేర్కొంది. దేశంలో వైద్య విద్యార్థుల వృత్తిపరమైన బాధ్యతలపై     మిగతా ఎన్‌ఎంసీ తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. వైద్య విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఈ అంశాలు కీలకమని పేర్కొంది. వైద్య విద్యార్థులు రోగులతో సమర్థవంతంగా మాట్లాడటానికి స్థానిక భాష నేర్చుకోవాలని కోరింది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, వైద్యారోగ్య అత్యవసర పరిస్థితుల వంటి సందర్భాల్లో వీలైనంత సాయం చేయాలని సూచించింది. 

చదవండి: NMC: ఈ కాలేజీలపై ఢిల్లీ నుంచి నిఘా

శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి 

కేవలం చికిత్సకే పరిమితం కాకుండా వైద్యారోగ్య వ్యవస్థపై నమ్మకం కలిగేలా రోగి–వైద్యుడి సంబంధం ఉండాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని.. జాతీయ ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించింది. కేవలం పుస్తకాల నుంచే మాత్రమే కాకుండా అధ్యాపకుల అపార అనుభవం, ఆచరణాత్మక బోధన నుంచి నేర్చుకోవాలని పేర్కొంది. విద్యార్థులు ప్రాక్టికల్‌ రికార్డులు, కేస్‌ట్లను శ్రద్ధగా నిర్వహించాలని.. కాపీ చేయడం, తారుమారు చేయడం వంటివి చేస్తే తగిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. 

చదవండి: NMC: వైద్య కళాశాలకు గ్రీన్‌ సిగ్నల్‌

ఎన్‌ఎంసీ మార్గదర్శకాల్లోని ఇతర ముఖ్యాంశాలివీ.. 

  • సమాజం నుంచి నేర్చుకోవడం వైద్యవిద్యలో ముఖ్యమైన భాగం. జీవన ప్రమాణాలు, సామాజిక పరిస్థితులు, ప్రాథమిక సౌకర్యాలు, వైద్య ఆరోగ్య వసతులు, పర్యావరణ పరిస్థితులు తెలుసుకోవాలి. రోగులు ఆస్పత్రికి వచ్చినప్పుడు వారిని, వారి సమస్యను అర్థం చేసుకోవాలంటే ఇలాంటి జ్ఞానం, అనుభవం అవసరం. వీలైనప్పుడల్లా విద్యార్థులు వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి. 
  • వైద్యవిద్య కోర్సు కొన్ని ఒత్తిళ్లు, సవాళ్లతో కూడి ఉంటుంది. అవసరమైతే వృత్తిపరమైన సాయాన్ని పొందాలి. కాలేజీలు నిర్వహించే యోగా, ధ్యానం శిక్షణలో పాల్గొనాలి. తద్వారా మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలి. విద్యార్థులు ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించడానికి రెఫరల్‌ సిస్టమ్‌ ఉండాలి. కాలేజీలు స్టూడెంట్ల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి.  
  • మెడికల్‌ కాలేజీలు పరీక్షల విషయంలో నిజాయతీగా వ్యవహరించాలి. అంతర్గత మూల్యాంకన మార్కులను పెంచకూడదు. 
  • విద్యార్థులు పేరున్న ఆస్పత్రులు నిర్వహించే వైద్యారోగ్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన ప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనడం అవసరం.  
Published date : 17 Apr 2023 01:22PM

Photo Stories