Skip to main content

District Library: గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు

మహేశ్వరం: గ్రంథాలయాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు.
District Library
గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు

మండల పరిధిలోని కేసీ తండా సమీపంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కోసం జూలై 30న‌ స్థానిక సర్పంచ్‌, గ్రంథాలయ శాఖ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గం, మండలాల్లో గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. కేసీ తండాలోని సర్వే నంబర్‌ 306లో రూ.కోటి నిధులతో అధునాత గ్రంథాలయ భవనం నిర్మాంచేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు, ఐటీ తదితర రంగాలకు శిక్షణ పొందే యువతకు ఉపయోగపడేలా ఈ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్‌ కుమార్‌, సర్పంచ్‌ మోతిలాల్‌ నాయక్‌, లైబ్రేరియన్‌ ప్రతాప్‌ పాల్గొన్నారు.

చదవండి:

Seva Bharat Trust: విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ

Collector Jitesh V Patil: విద్యార్థులు ఇష్టపడి చదవాలి

Published date : 31 Jul 2023 04:18PM

Photo Stories