Skip to main content

Seva Bharat Trust: విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ

Seva Bharat Trust: books and bags free distribution in students

బనశంకరి: అన్నిదానాల్లో కల్లా విద్యాదానం చాలా గొప్పదని, పేద విద్యార్థుల చదువు కోసం దాతల అందించే సాయం మరువలేమని విద్యాశాఖ క్లస్టర్‌ రీసెర్చ్‌ అధికారిణి సుమంగళి తెలిపారు. బుధవారం వివేక్‌ నగరలోని సేవా భారత్‌ట్రస్ట్‌ తెలుగు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్రస్ట్‌ ద్వారా దాత బండి ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. నేటి పోటీయుగంలో విద్యచాలా అవసరమని, దానిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టిసారించి చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ట్రస్ట్‌సభ్యులు జీ.అశోక్‌రెడ్డి, జీ.కోటేశ్వరరెడ్డి, ఎస్‌.ఉమామహేశ్వర్‌, జగన్నాథ్‌, హెచ్‌ఎం తిప్పేస్వామి, ఉపాధ్యాయులు భువనానంద, రామమోహన్‌రెడ్డి, లలితమ్మ పాల్గొన్నారు.

Due to Rain July 28th Schools and Colleges Holidays : రేపు కూడా స్కూల్స్‌, కాలేజీకు సెల‌వులు.. ఈ పరీక్షలన్నీ వాయిదా.. ఇంకా..

Published date : 27 Jul 2023 01:32PM

Photo Stories