Due to Rain July 28th Schools and Colleges Holidays : రేపు కూడా స్కూల్స్, కాలేజీకు సెలవులు.. ఈ పరీక్షలన్నీ వాయిదా.. ఇంకా..
అలాగే ఇప్పుడు జులై 29వ తేదీ (శనివారం) మొహర్రం పండగ ఉంది.. కాబట్టి పాఠశాలలకు సెలవు ఉండే అవకాశం ఉంటుంది . అలాగే జులై 28వ తేదీ (శుక్రవారం) కొన్ని ప్రాంతాల్లో కూడా మొహర్రం జరుపుకుంటారు. జులై 30వ తేదీన ఆదివారం పాఠశాలకు, కాలేజీలకు సాధారణంగానే హాలిడే. దీంతో కొన్ని పాఠశాలలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవు ఉండవచ్చు. ఈ జూలై నెలలోనే ఊహించని విధంగా స్కూల్స్, కాలేజీలకు భారీగా సెలవులు వచ్చాయి. దీంతో ఉపాధ్యాయులకు సరైన టైమ్‌లో సిలబస్ పూర్తి చేయడంతో ఆటకం ఏర్పాడే అవకాశం ఉంది.
TS 10th Class మోడల్ పేపర్స్ 2023
నేపథ్యంలో..రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు.. అన్ని విద్యా సంస్థలకు వరుసగా సెలవులు ప్రకటించడంతో.. పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తెలంగాణలో స్కూల్స్, కాలేజీలకు వానలతో, బంద్‌లతో ఈ జూలై నెలలోనే భారీగా సెలవులు ఇచ్చారు. ఈ నెలలోనే దాదాపు 10 రోజులకు పైగా సెలవులు ఇచ్చారు. ఈ ప్రభారం అన్ని పరీక్షలపై పడింది.
పలు తేదీలు మార్పులు..
తెలంగాణలో వర్షాలు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అన్నిరకాల పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నతాధికారులు యూనివర్సిటీలు, విద్యా సంస్థలకు సూచించారు. దీంతో ఇప్పటికే డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఇంటర్నల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిగ్రీ ప్రవేశాల తేదీల్లోనూ మార్పులు చేశారు. ఇంజనీరింగ్ సీట్లలో తొలివిడత చేరికలకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలను పొడిగించారు. మలి విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జూలై 27తో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుండటంతో.. ఈ గడువునూ మరికొంత పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.
TS 10th Class స్టడీ మెటీరియల్
తెలంగాణ పాఠశాలల్లోని విద్యార్థులకు జూలైలో జరగాల్సి ఉన్న ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ–1) పరీక్షలను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు. వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇటీవలి వరకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఇప్పుడీ వర్షాలతో మళ్లీ అంతరాయం రావడంతో నిర్ణీత సిలబస్ పూర్తవలేదని.. ఎఫ్‌ఏ–1 పరీక్షలను వాయిదా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఈ ప్రవేశాల తేదీని కూడా పొడిగింపు..
తెలంగాణలో భారీ వర్షాలతో వరుస సెలవులు, ఇంటర్నెట్, ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును జూలై 25వ తేదీ నుంచి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇంకా లక్ష మందికిపైగా ఇంటర్‌లో చేరాల్సి ఉందని.. వానలు ఇలాగే కొనసాగితే గడువు పొడి గించాలని బోర్డ్ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.
పలు వర్సిటీల్లో పరీక్షలు వాయిదా.. అలాగే..
ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ సహా పలు యూని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో అంతర్గత పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఈ నెలాఖరులో నిర్వ హించాలని భావించినా.. వానలు తగ్గే అవకాశం లేకపోవడంతో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు ఆలస్యం కానున్నాయి. డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ కౌన్సెలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీని జూలై 28వ తేదీ వరకూ పొడిగించారు.
ఇక ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆప్షన్ల గడువు 27తో ముగియనుంది. ఈ నెల 31న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్య కమిషనరేట్ తెలిపింది. వర్షాలు తగ్గకపోతే రెండో విడత చేరికల తేదీని పొడిగించే వీలుందని అధికారులు అంటున్నారు.
తెలంగాణలో 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి సెలవులు ఇవే..
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.
Tags
- July 28th school holiday
- Telangana Rain News
- due to rain schools holidays
- due to rain colleges holidays in ts
- Schools and Colleges Holiday due rain
- Schools and Colleges Closed 2023
- heavy rain due school holidays
- Heavy Rainfall in Telangana
- Holidays declared for schools and colleges on July 28th 2023 in Telangana