Collector Jitesh V Patil: విద్యార్థులు ఇష్టపడి చదవాలి
Sakshi Education
కామారెడ్డి రూరల్: విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. భారత సేవాశ్రమ సంఘం ప్రతినిధి వెంకటేశ్వరానంద ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు 30,000 నోటు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాకిషన్ పాల్గొన్నారు.
CBSE Board Exams 2024: పరీక్షల షెడ్యూల్ విడుదల... ఈ సారి 55 రోజులు!
Published date : 25 Jul 2023 03:28PM