UGC: ఉన్నతవిద్యకు సారథులు
నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)పై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు అభిప్రాయ సేకరణ చేసేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి ‘నూతన విద్యావిధానం–స్టూడెంట్ అంబాసిడర్ ఫర్ అకడమిక్ రిఫామ్స్ ఇన్ ట్రాన్స్‌ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎన్‌ఈపీ సారథి)అని పేరుపెట్టింది. ఇందులో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ వారినే ఆయా వర్సిటీల్లో స్టూడెంట్ అంబాసిడర్లుగా నియమించనుంది. ఈ మేరకు ఉన్నత విద్యాసంస్థలు, వర్సిటీల నుంచి ముగ్గురు విద్యార్థుల పేర్లను ప్రతిపాదించాలని సూచించింది. ప్రతిపాదిత విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించే సంస్థాగత సామర్థ్యాలు, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలతోపాటు బాధ్యతాయుత భావాలను కలిగి ఉండాలని సూచించింది.
చదవండి: Common Engineering Entrance Test: ‘నీట్’లాగా ఇంజనీరింగ్‌కూ.. ఒకే ఎంట్రన్స్!
దేశవ్యాప్తంగా 300 మంది ఎంపిక
వర్సిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా జూలైలో 300 మందిని ఎన్‌ఈపీ సారథులుగా ఎంపిక చేయనుంది. వీరు ఆయా క్యాంపస్‌లలో కొత్త విద్యావిధానంపై సంపూర్ణ అవగాహన కల్పించడంతోపాటు ఎన్‌ఈపీ అమలులో విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడం, ఎన్‌ఈపీ కార్యక్రమం అమలును అర్థం చేసుకోవడానికి యూజీసీకి ఫీడ్‌బ్యాక్ మెకానిజం అందించడం, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషిచేయడంలో కీలకపాత్ర పోషించనున్నారు. ఎన్‌ఈపీ సారథి సేవలకు గుర్తింపుగా యూసీజీ ప్రత్యేక సర్టిఫికెట్ ఇవ్వనుంది. వివిధ స్థాయిల్లో ఉన్నతవిద్యను అభ్యసిస్తూ.. సర్టిఫికెట్, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీని చేస్తున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు. ఎన్‌ఈపీ సారథికి ఎంపికైనవారు యూజీసీ అధికారిక సోషల్ మీడియాను వినియోగించుకోవచ్చు. వీరికి యూజీసీ ఆన్‌లైన్‌లో నిర్వహించే అన్ని ఈవెంట్స్‌కు శాశ్వత ఆహ్వానంతోపాటు యూజీసీ న్యూస్‌లెటర్‌లో వ్యాసాలను ప్రచురించే అవకాశం దక్కుతుంది.
చదవండి: Earn while Learn: కాలేజీలు, వర్సిటీల్లో.. చదువు... సంపాదన