Free Training: చేతి వృత్తుల శిక్షణతో జీవనోపాధి
అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సమాఖ్య అధ్వర్యంలో ఆర్‌పీలకు రాజ్ కుమార్ ఫౌండేషన్ సభ్యురాలు మార్చి 1న చేతివృత్తులపై అవగాహస సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదరికాన్ని దూరం చేసుకోవడానికి చేతి వృత్తుల ద్వార ఉపాధి పొందడం సరైన వేదికగా పేర్కొన్నారు. సొంత గ్రామాల్లోనే స్వయం ఉపాధి పొందవచ్చని, చేతి వృత్తుల్లో నైపుణ్యం సంపాదించడానికి పలు సూచనలు, సలహాలు అందజేశారు.
చదవండి: Free Training for Unemployed Youth: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి
చేతి వృత్తుల ద్వార శిక్షణ ఇవ్వడంతోపాటు శిక్షణ దృవీకరణ పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టైలరింగు, కంప్యూటర్, ఎంబ్రాయిడరీ, బ్యూటీపార్లర్, బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్‌పీలు రాణి, లత, రాజేశ్వరి, ఏ. రాణి, ప్రశాంతి, మనిషా, చిన్నమ్మ, సుంకన్న, ధనుంజయ, బాలరాజు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.