Free Training for Unemployed Youth: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి
Sakshi Education
సీతారామరాజు జిల్లా: సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైం అండ్ షిప్ బిల్డింగ్(సెమ్స్) ఆధ్వర్యంలో విశాఖపోర్ట్ అథారిటీ సహకారంతో 27 ఏళ్ల వయసులోపు నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
10వ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటీఐ ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, డిప్లమో, ఇంజినీరింగ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్తీర్ణులైన విశాఖ పోర్ట్ పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణకు అర్హులు. వీరికి కొరియర్ సూపర్‌వైజర్, వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, పిక్కర్, ఇన్వెంటరీ కంట్రోలర్, సి.ఎన్.సి ఆపరేటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తామని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కమాండర్ గోపీ కృష్ణ శివ్వం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 28లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సింథియా జంక్షన్‌లోని సెమ్స్ కేంద్రంలో గానీ, 99481 83865, 77948 40934, 0891–2704010ను సంప్రదించవచ్చు.
చదవండి: Free Coaching: పోటీ పరీక్షలకు గౌరీ గ్రంథాలయంలో ఉచిత శిక్షణ
Published date : 24 Feb 2024 03:32PM
Tags
- Free training
- Employment
- Unemployed Youth
- Free training for unemployed youth
- Center of Excellence in Maritime and Shipbuilding
- Education News
- andhra pradesh news
- EmploymentTraining
- FreeTrainingProgram
- SkillDevelopment
- YouthEmpowerment
- VocationalSkills
- Opportunity
- UnemployedYouth
- sakshieducation updates