Sree Ganesh: డిజిటలైజేషన్ తో భాషకు పట్టం కడుతున్న ప్రొఫెసర్
Sakshi Education
మనిషి మనుగడకు మాతృభాషనే కీలకం. మాతృభాషపై పట్టు సాధిస్తేనే ఇతర భాషలు, వివిధ రంగాల్లోనూ రాణించడానికి ఆస్కారం ఉంటుంది.
ఆ ప్రాధాన్యతను గుర్తించి తెలుగు సాహిత్యంతోపాటు చరిత్ర, కళలు, తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు ఇలా ఎన్నో అంశాలను డిజిటలైజ్ చేస్తున్నారు జర్మనీలోని ప్రొఫెసర్ శ్రీగణేష్ తొట్టెంపూడి. గుంటూరుకు చెందిన ఈయన.. 20 ఏళ్ల నుంచి సైన్స్ టెక్నాలజీ అండ్ లాంగ్వేజెస్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. భాషకు సాంకేతికతను జోడిస్తే ఎంతో ప్రయోజనముంటుందని భావించి.. డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టారు. స్వస్థలం ఆంధ్రా అయినా తెలంగాణ బో నాలు, బతుకమ్మ పండుగలతో పాటు కాకతీయుల రాజ్యం, ఓరుగల్లు చరిత్ర, వరంగల్‌స్తూ పం, శాస నాలు, హంపి, అన్నమయ్య కీర్తనలు, కథలు, తెలంగాణ సాహిత్యం, తెలుగు పద్యాలు, ఉత్తరమాల, తాళ పత్రాలపై రాసిన గ్రంథాలను డిజిటలైజేషన్ చేశారు.
చదవండి:
Exams: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్..13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు!
Published date : 21 Feb 2022 01:08PM