Sports: కృష్ణా యూనివర్సిటీ అంతర కళాశాలల రెజ్లింగ్ పోటీలు
Sakshi Education
మధురానగర్(విజయవాడ సెంట్రల్): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవంబర్ 20న కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళలు, పురుషుల రెజ్లింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.
పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి ప్రారంభించారు. పోటీలలో ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలతో పాటు పీబీ సిద్ధార్థ కళాశాల, వికాస్ కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, నున్న, కేబీఎన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ వెయిట్ కేటగిరీలలో ఎస్‌కే ఖాశిం బాషా, కె.హరిశంకర్, కె.అజయ్, సీఎస్ సాయి తేజ తదితరులు విజేతలుగా నిలిచారు.
చదవండి: KIA: వర్సిటీకి ఉచితంగా రెండు ఎలక్ట్రికల్ కార్లు
విజేతలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర కె.భాగ్యలక్ష్మి, వ్యాయామ విద్య విభాగాధిపతి మండవ కోటేశ్వరరావు, డాక్టర్ డి.యుగంధర్ అభినందించారు.
Published date : 21 Nov 2023 12:26PM