KGBV: నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా కేజీబీవీ.. బోధనలో ఠీవి
వైఎస్ జగన్ సర్కారు హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా చక్కటి సదుపాయాలు కల్పిస్తుండడంతో కేజీబీవీల్లో చేరేందుకు బాలికలు పోటీ పడుతున్నారు. రూపాయి ఫీజు లేకుండా కేజీబీవీల్లో కార్పొరేట్‌ను తలదన్నే విధంగా నాణ్యమైన ఇంగ్లిష్ మీడియంలో బోధనను అందిస్తున్నారు.
Also read: Hidden Talent: బుడతా..! నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్.. నెటిజన్లు ఫిదా..!
సీట్లు లేవు..
ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుండడంతో కేజీబీవీల్లో ఏటా ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు గ్రామాలకు వెళ్లి డ్రాపౌట్లను గుర్తించి, పిల్లలను, తల్లిదండ్రులను సిబ్బంది చైతన్యం చేసి కేజీబీవీల్లో చేర్పించేవారు. అప్పటికీ సీట్లు మిగిలిపోయేవి. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వందలాది మంది చేసుకున్న దరఖాస్తులలో వివిధ ప్రామాణికతలను చూసి సీట్లను భర్తీ చేస్తున్నారు. వసతి సదుపాయాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్ల కోసం వచ్చిన వారికి కేటాయించలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని సమగ్రశిక్షా జిల్లా ఏపీసీ డాక్టర్ రోణంకి జయప్రకాష్ చెబుతున్నారు.
Also read: Teaching Method viral video ‘ఏం ఐడియారా బాబూ’ అంటున్న జనం!
ఫలితాల్లో టాప్
వీటిలో చదువుతున్న విద్యార్థులు సైతం గణనీయమైన ఫలితాలను సాధిస్తున్నారు. టెన్త్, ఇంటర్ రెండింటా స్టేట్‌లో 90 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ ఏడాది 10వ తరగతిలో సారవకోట కేజీబీవీకి చెందిన ఉర్లాన జాహ్నవి 600కు గాను 590 మార్కులు తెచ్చుకుని ఈ స్కూళ్లలో స్టేట్ టాపర్‌గా నిలిచింది. సాక్షాత్తు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా జగనన్న ఆణిముత్యాల పేరిట ఘనంగా సత్కారాన్ని అందుకుంది. అలాగే ఇంటర్మీడియెట్‌లో రుప్ప యమున– ఎంపీసీలో 974 (కేజీబీవీ శ్రీకాకుళం), వంపూరు అశ్విని– బైపీసీలో 956 (కేజీబీవీ పొందూరు), బడే ఇందిర– సీఈసీలో 910 (కేజీబీవీ కవిటి) మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు.
Also read: Enquiry Committee: విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ కమిటీ..కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
25 కేజీబీవీలు.. 6690 మంది బాలికలు
6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్య ను అందించే కేజీబీవీ విద్యాలయాల్లో తరగతికి 40 సీట్లు చొప్పున భర్తీ చేస్తారు. ఇంటర్మీడియెట్‌కు వచ్చేసరికి ఒక కేజీబీవీలో ఒక గ్రూపును మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ఇయర్‌కు 40 సీట్లు చొప్పున భర్తీ చేశారు. 30 మండలాల శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నా యి. వీటిల్లో ప్రస్తుతం 6,690 మంది చదువుతున్నారు. సీట్లన్నీ భర్తీ కావడంతో తరగతి గదులు కిటకిటలాడుతున్నాయి. సబ్జెక్టు టీచర్ల కొరత లేకుండా ఇటీవల ప్రభుత్వం అవసరైన బోధనా సిబ్బందిని నియమించింది. అలాగే డిజిటల్ విద్యా బోధన, నాడు–నేడుతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. నాణ్యమైన మెనూ ప్రకా రం భోజనం, అమ్మఒడి, విద్యాకానుక, ట్యాబ్‌ల అందజేత, బైజూస్ కంటెంట్‌తో బోధన వంటి కార్యక్రమాలతోపాటు అనేక రాయితీలు కల్పిస్తున్నారు.
Also read: National Education Policy: అత్యంత ఆధునిక సౌకర్యాలతో వర్చువల్ ఓపెన్ స్కూల్ ప్రారంభం
- కేజీబీవీల్లో చదువుకు ఎనలేని డిమాండ్
- 25 కేజీబీవీల్లో 6690 మంది బాలికల విద్యాభ్యాసం
- ఎన్నో వసతులు, మరెన్నో సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్న విద్యాలయాలు
రూపాయి ఖర్చు లేదు
కేజీబీవీలు నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. రూపాయి ఖ ర్చు లేకుండా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా చదువు, వసతి కల్పిస్తూ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నాం. సమగ్రశిక్ష స్టేట్ పీడీ, కలెక్టర్ సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అక్కడి బాలికలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఈ ఏడాది కూడా విద్యార్థినుల ప్రవేశాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మూడు పూటల నాణ్యమైన, పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్నాం. ఇటీవలి బోధనా సిబ్బందిని నియమించాం.
Also read: WIPO Fellowship: AU రీసెర్చ్ అధికారికి అంతర్జాతీయ ఫెలోషిప్
– డాక్టర్ రోణంకి జయప్రకాష్, సమగ్రశిక్షా ఏపీసీ, శ్రీకాకుళం