Skip to main content

Teaching Method viral video: ‘ఏం ఐడియారా బాబూ’ అంటున్న జనం!

నగరాల్లోని స్కూళ్లు హైటెక్‌గా మరిపోయాయి.  గ్రామాల్లోని స్కూళ్లు ఇంకా ఆధునికతను సంతరించుకోలేదు. అయితే గ్రామీణ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అవసరమైన సులభ పద్ధతులను ఆవిష్కరించడంలో అక్కడి ఉపాధ్యాయులు ముందుంటున్నారనే పలు ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. పాటల రూపంలో చిన్నారులకు ఏబీసీడీలు నేర్పడం, పాఠాలు బోధించడం వంటివి చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో ఇటువంటి వీడియోలు కనిపిస్తుంటాయి. 
Teaching Method viral video
Teaching Method viral video

Also read: Enquiry Committee: విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ కమిటీ..కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో ఒక విద్యార్థి చేతితో ఒక కర్రపట్టుకుని కనిపిస్తాడు. ఆ కర్రకు పైభాగాన హిందీలో ‘క’ అనే అక్షరం రాసివుంటుంది. మరోవైపు బ్లాక్‌బోర్డుపై దీర్ఘాలు, ఒత్తులు రాసివుంటాయి. ఆ విద్యార్థి ‘క’ అక్షరాన్ని ప్రతీ దీర్ఘం, ఒత్తు ముందు చూపిస్తూ, దానిని ఉచ్ఛరిస్తుంటాడు. అనంతరం క్లాసులోని మిగిలిన విద్యార్థులు ఆ అక్షరాన్ని ఉచ్ఛరిస్తుంటారు. ఈ వీడియో రికార్డు స్థాయిలో వైరల్‌ అవుతోంది. 

Also read: Sakshi Spell Bee 2023 Category - 3 | English spelling contest in TS || #SakshiEducation

 

 వీడియోను ట్విట్టర్‌లో @Ankitydv92 పేరుగ గల అకౌంట్‌లో జూలై 27న షేర్‌ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 4 లక్షలకు మించిన వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్‌ చేస్తున్నారు. ఒక యూజర్‌ దీనిని అద్భుతమైన క్రియేటివిటీ అని పేర్కొన్నారు.

Also read: Sakshi Spell Bee 2023 Category - 4 | English spelling contest in TS || #SakshiEducation

 

Published date : 29 Jul 2023 06:43PM

Photo Stories