ITI: అప్రెంటిస్‌తో కొలువు సులువు
అందుకే అప్రెంటిస్ పద్ధతిని ఐటీఐ విద్యార్థులు చాలా కీలకంగా భావిస్తున్నారు. అప్రెంటిస్‌షిప్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కోర్సులో ఉండగానే పరిశ్రమల అవసరాలు తెలుసుకునేందుకు ఆన్ జాబ్‌వర్క్ పేరుతో కాలేజీలు పరిశ్రమల పరిశీలనకు అవకాశం కల్పిస్తాయి.
అప్రెంటిస్‌షిప్ తర్వాత పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒకవేళ అప్రెంటిస్‌షిప్ లేకుండా ఉద్యోగ అవకాశాలు ఇచ్చినా ముందుగా పరిశ్రమ ల్లో కొన్ని నెలల పాటు అప్రెంటిస్‌గా పనిచేయాల్సి ఉంటుంది.
చదవండి: Free training in computer courses: కంప్యూటర్ కోర్సుల్లో యువతకు ఉచిత శిక్షణ
కాలేజీలకు వచ్చి..
జిల్లాలో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువ మంది ఐటీఐ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తక్కువ వయస్సులో ఉపాధి లభించటం ఇందుకు కారణం. జిల్లాలో ఎచ్చెర్ల, శ్రీకాకుళం డీఎల్‌టీసీ, పలాసల్లో మూడు ప్రభుత్వ ఇండ్రస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లు ఉండగా, 20 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. ఏడాదికి మూడు వేల మంది విద్యార్థులు రిలీవ్ అవుతుండగా, 1000 మంది వరకు అప్రెంటిస్ చేస్తున్నారు. పరిశ్రమలే ఐటీఐలకు వచ్చి విద్యార్థులను అప్రెంటిస్ మేళాలు నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి.
ఆర్‌టీసీ, ఇండియన్ రైల్వే వంటి ప్రభుత్వ సంస్థలు, జిల్లాలోని అరబిందో, ఆంధ్రా ఆర్గానిక్స్, స్మా ర్ట్ కెం, నాగార్జునా అగ్రికెం, శ్యాంక్రిగ్ పిస్టన్స్ వంటి సంస్థలతో పాటు, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పరిశ్రమలు సైతం విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ మేళాలు నిర్వహిస్తున్నాయి.
12 నెల ల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది. విద్యార్థుల క్రమశిక్షణ, నైపుణ్యం, శ్రమించే తత్వం వంటివి నచ్చితే ఉద్యోగ అవకాశాలు సైతం కల్పిస్తున్నారు.అప్రెంటిస్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీం విద్యార్థికి అందజేసే రూ. 1500తో కలిపి రూ. 7000 నుంచి రూ. 8050 అందజేస్తున్నారు. దీంతో విద్యార్థుల ఖర్చు లు ఇతర అవసరాలకు వేతనం లభిస్తుంది. కొన్ని పరిశ్రమలు భోజనం, వసతి సైతం కల్పిస్తున్నాయి. విద్యార్థులు ఐటీఐ పూర్తిచేశాక అప్రెంటిస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాలు మేరకు సైతం అప్రెంటిస్ అనంతరం స్థానికంగా ఉద్యోగాలకు అవకాశం లభిస్తుంది. ప్రధానంగా ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్, మోటార్ మెకానిక్ వంటి ట్రేడులు చదివిన విద్యార్థులకు ఈ అవకాశం ఉంది.