పారదర్శకమైన సేవలు అందిస్తున్నందుకుగాను విజయవాడలోని Dr N T R University of Health Sciencesకి ISO సర్టిఫికెట్ లభించింది.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ఐఎస్‌వో సర్టిఫికెట్
వర్సిటీలో ఆగస్టు 18న Andhra Pradesh State Medical and Health Department మంత్రి విడదల రజని, ISO ఏపీ, తెలంగాణ ఇన్‌చార్జి శివయ్య చేతుల మీదుగా వీసీ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ ISO సర్టిఫికెట్‌ను అందుకోనున్నారు. నెల రోజుల కిందట శివయ్య బృందం వర్సిటీని సందర్శించి Medical, Ayush, Para Medical కోర్సుల్లో అడ్మిషన్లు జరుపుతున్న తీరు, అకడమిక్ విభాగంలో పారదర్శక సేవలు, పరీక్షల నిర్వహణ వంటి అన్ని విషయాలను పరిశీలించింది. వర్సిటీలో పారదర్శకంగా నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు గుర్తించి ISO సర్టిఫికెట్‌ను అందించనున్నారు. కాగా ఇప్పటివరకు దేశంలోని ఏ ఆరోగ్య వర్సిటీ ISO సర్టిఫికెట్‌ను పొందలేదని, దీన్ని తొలిసారిగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అందుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.