Skip to main content

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో ముగ్గురు మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో ప్రముఖులైన డా.సుధాకర్‌ (రిటైర్డ్‌ పీడియాట్రిక్‌ ప్రొఫెసర్‌ కర్నూలు), డా.హేమలతాదేవి (గైనకాలజీ ప్రొఫెసర్, విక్టోరియా హాస్పిటల్, విశాఖపట్నం), డా.గోపాలకృష్ణ, (కంటివైద్య నిపుణులు, నారాయణ మెడికల్‌ కాలేజీ) ఉన్నారు. మరో ఇద్దరు ప్రముఖులను ఎంపిక చేశారు. మానసిక వైద్యనిపుణులు డా.ఇండ్ల రామసుబ్బారెడ్డి, యూరాలజీ ప్రొఫెసర్, డా.మల్లికార్జునరెడ్డి ఉన్నారు. ఫ్యాకల్టీ ప్రొఫెసర్లుగా ఉన్న డా.భారతి (ప్రొఫెసర్, ఎస్వీ మెడికల్‌ కాలేజీ), డా.షరో¯న్‌ సోనియా (ప్రొఫెసర్, ఫార్మకాలజీ), డా.భాగ్యలక్ష్మి (ఎండీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆంధ్ర మెడికల్‌ కాలేజీ) ఉన్నారు.
Published date : 20 Mar 2021 03:00PM

Photo Stories