OU: ఓయూలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ కామర్స్ విభాగంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది.
ఆగస్టు 10న కళాశాల ఆడిటోరియంలో క్‌లైమేట్ ఫైనాన్స్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ రిస్క్ అండ్ రివార్డ్ అనే అంశం పై రెండు రోజుల సదస్సు జరగనుంది. కామర్స్ విభాగం హెడ్ ప్రొ.చెన్నప్ప అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి, గౌరవ అతిథిగా ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి వాణిప్రసాద్ హాజరై జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించి మాట్లాడారు.
వాతావరణ మార్పు వంటి సమకాలీన సమస్యల పై సదస్సు నిర్వహించడం పట్ల వారు అభినందించారు. కార్యక్రమంలో కామర్స్ బీవోఎస్ ప్రొ.అప్పారావు, డీన్ ప్రొ. గంగాధర్, ప్రొ.నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
Drone Pilot: 18 ఏళ్లకే డ్రోన్ పైలట్ అయ్యా... నా సక్సెస్ జర్నీ సాగిందిలా..!
Published date : 11 Aug 2023 01:48PM