నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
Sakshi Education

జనగామ రూరల్: మహిళలు ఆర్థికంగా ఎదగడానికి శిక్షణ కార్యక్రమాలు ఎంతో అవసరమని ఉపాధి అ ధికారి ఎన్. మాధవి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ డీఐటీ సహకారంతో ప్రొడక్టవిటీ కౌ న్సిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఉపాధిపై అవగాహన కల్పించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో అవసరమని ఎంసీఎన్‌ఎఫ్ సత్యవేద తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. డైరెక్టర్ దీప్తి రమేష్, ఈలేటి కల్పలత, మహిళలు పాల్గొన్నారు.
Published date : 10 Aug 2023 10:17AM