Skip to main content

Tanishka Sujit clears Degree exam: ప‌దిహేనేళ్ల‌కే డిగ్రీ పూర్తి... చీఫ్ జ‌స్టిస్ అవుతానంటోన్న ఇండోర్ అమ్మాయి...

సాధార‌ణంగా ప‌దిహేనేళ్ల వ‌య‌సులో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతూ ఉంటారు. కానీ, ఓ అమ్మాయి ఈ వ‌య‌సులోనే డిగ్రీ పూర్తి చేసి వార్త‌ల్లో నిలిచింది. ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల స‌మ‌యంలో తాను ఎంత‌గానో ప్రేమించే తండ్రి చ‌నిపోయాడు.
Tanishka Sujit
ప‌దిహేనేళ్ల‌కే డిగ్రీ పూర్తి... చీఫ్ జ‌స్టిస్ అవుతానంటోన్న ఇండోర్ అమ్మాయి...

కానీ, ఆ బాధ‌నంతా పంటికింద భ‌రిస్తూనే ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైంది. ఇప్పుడేమో ఆ అమ్మాయి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. త‌నిష్క సుజిత్ ఇన్‌స్ఫిరేష‌న్ స్టోరీ మీ కోసం.. 

ప‌దేళ్ల‌కే ప‌దో త‌ర‌గ‌తి పూర్తి... 
మ‌ధ్యప్ర‌దేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సుజిత్ చంద్రన్, అనుభా దంప‌తుల కుమార్తె త‌నిష్క సుజిత్‌. ఈ అమ్మాయి చ‌దువుల్లో ఎప్పుడూ ముందుండేది. ప‌దేళ్ల‌కే ప‌దో త‌ర‌గ‌తి, ప‌న్నెండేళ్ల‌కు ఇంట‌ర్ పూర్తి చేసింది. ఇంట‌ర్ సెకండియ‌ర్ ఫైన‌ల్ ప‌రీక్ష‌లు రాసే స‌మ‌యంలో ఆమె తండ్రి మ‌ర‌ణించాడు. 

చ‌ద‌వండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ప‌రీక్ష‌లో స‌బ్జెక్ట్‌ల వారిగా అడిగిన ప్ర‌శ్న‌లు ఇవే.. పేప‌ర్‌-1 & 2 'కీ' కోసం కోసం క్లిక్ చేయండి

తండ్రి మ‌ర‌ణించ‌డంతో...
కోవిడ్ మొద‌టి వేవ్‌ స‌మ‌యం(2020)లో త‌నిష్క తండ్రి సుజిత్ చంద్రన్ మ‌ర‌ణించాడు. ఆ స‌మ‌యంలో ఇంట‌ర్ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఆమెను కుంగ‌దీసింది. ఆ బాధ‌ను భ‌రిస్తూనే ఆమె ప‌రీక్ష‌ల‌కు హాజ‌రై, అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి ఉత్తీర్ణురాలైంది. 

Indore’s 15-year-old Tanishka

తాజాగా ఇండోర్‌లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం ప‌రిధిలోని ఓ క‌ళాశాల‌లో ఆమె డిగ్రీ ఉత్తీర్ణురాలైది. బీఏ చివరి సంవత్సరం సైకాలజీ పరీక్షలో 74.20 శాతం మార్కులు సాధించింది. యూకేలో న్యాయశాస్త్రం చదవాలనేది త‌న కోరిక అని ఈ సంద‌ర్భంగా త‌నిష్క చెబుతోంది. లా పూర్తి చేసి భారతదేశ అతి పిన్న వయస్కుడైన ప్రధాన న్యాయమూర్తి కావాల‌నేది త‌న ల‌క్ష్య‌మ‌ని ఈ ప‌దిహేనేళ్ల అమ్మాయి చెబుతోంది. 

IBPS 2023: డిగ్రీ అర్హ‌త‌తో 4,045 బ్యాంకు క్ల‌ర్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

ఈ ఏడాది భోపాల్‌లో ఏప్రిల్‌లో నిర్వ‌హించిన జాయింట్ కమాండర్ల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో త‌నిష్క ప్ర‌తిభాపాట‌వాల‌ను తెలుసుకున్న మోదీ ఆ అమ్మాయిని క‌లిసి, భ‌విష్య‌త్తులో ఉన్న‌త శిఖరాలు అధిరోహించాల‌ని దీవించారు.

Published date : 03 Jul 2023 01:52PM

Photo Stories