Swachh Survekshan Awards Top-10 States List- దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన, చెత్త నగరాలు ఇవే
దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. 2023 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించింది. ఇందులొ దేశంలోనే క్లీన్ సిటీగా ఇండోర్‌తో పాటు గుజరాత్‌లోని సూరత్ కూడా మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
పారిశుధ్యం విభాగంలో సర్వే, టెస్ట్ ప్రాక్టీస్, సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఏటా జారీచేస్తుంది. అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా సత్తా చాటాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ నగరాలు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
టాప్-10లో చోటు దక్కించుకున్న నగరాలివే..
1. ఇండోర్, మధ్యప్రదేశ్
1. సూరత్, గుజరాత్ (ఈసారి ఇండోర్‌తో పాటు సూరత్ సంయుక్తంగా టాప్-1లో చోటు దక్కించుకుంది)
3. ముంబై, మహారాష్ట్ర
4. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
5. భోపాల్, మధ్యప్రదేశ్
6. విజయవాడ, ఆంధ్రప్రదేశ్
7. న్యూఢిల్లీ, ఢిల్లీ
8. తిరుపతి, ఆంధ్రప్రదేశ్
9. హైదరాబాద్, తెలంగాణ
10. పూణె, మహారాష్ట్ర
దేశంలోనే అత్యంత పరిశ్రుభమైన రాష్ట్రాలివే..
1. మహారాష్ట్ర
2. మధ్యప్రదేశ్
3.చత్తీస్‌గడ్
దేశంలోనే అత్యంత చెత్త నగరాలివే..
1. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
2. అసాన్‌సోల్, పశ్చిమ బెంగాల్
3. హోరా, పశ్చిమ బెంగాల్
(మూడు నగరాలు పశ్చిమ బెంగాల్‌కే చెందడం గమనార్హం)