Telangana: బీఈడీ కాలేజీల్లో అసౌకర్యాలు
జిల్లాలో 13 బీఈడీ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో 100 సీట్లకు ప్రవేశాలు ఉండగా 3 కళాశాలల్లో 50 సీట్లు ఉన్నాయి. అయితే తమ కళాశాలల్లో పూర్తి సౌకర్యాలున్నాయంటూ ప్రతిఏటా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అనుమతులు పొందుతున్నారు.
జిల్లాలో బీఎడ్ కళాశాలలు పూర్తిగా ఎన్‌సీటీఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి విద్యాసంవత్సరంలో వ ర్సిటీ అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేస్తూ రెన్యూవల్ చేస్తున్నారు. బీఈడీ కళాశాలల్లో ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం 16 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాల్సిందిగా కేవలం నలుగైదుగురు అధ్యాపకులతోనే కళాశాలను నడుపుతున్నారు.
చదవండి: VC: కోర్సుల్లో కొత్త సిలబస్.. ఉద్యోగ అవకాశాలు లభించేలా..
మేనేజ్మెంట్ కోటా సీట్లను రూ. లక్షలకు అమ్ముకుంటున్నారు. అటెండెన్స్‌కు, ల్యాబ్‌కు, ప్రాక్టికల్స్‌కు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటుతో డబ్బులు వసూ లు చేస్తున్నారు. కన్వీనర్ కోటాలో వచ్చిన వారి నుంచి రెండేళ్లకు సంబంధించిన స్కాలర్‌షిప్ డబ్బు లను వసూలు చేస్తున్నారు. సొంత భవనాలు కొ న్నింటికి మాత్రమే ఉన్నాయి. సొంత భవనాలు ఉన్న ల్యాబ్‌లు సెమినార్ హాల్స్ లేవు.
విద్యార్థులకు సంబంధించిన అటెండెన్స్, ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి అటెండెన్స్ కళాశాల యాజమాన్యమే సంతకాలు చేసి రోజువారి కళాశాల నడుపుతున్న ట్లు చూపిస్తున్నారు. పరీక్షల ఫీజులు వర్సిటీ చెప్పిందానికంటే ఎక్కువ డెవలప్‌మెంట్ ఫీజు పేరుతో వసూలు చేస్తున్నారు. బోధన్‌లో ఓ కళాశాలలో సరై న తరగతులు, అందుబాటులో లేవు. ఒక్క హాల్ మాత్రమే ఉంది.
విద్యార్థులు రాకున్నా వచ్చినట్లు అటెండెన్స్ వేసుకుంటున్నారు. ఫ్యాకల్టీ కూడా అందుబాటులో లేరు. ఆర్మూర్‌లో కూడా ఓ కళాశాల భవనం లాడ్జ్‌ను తలపిస్తోంది. అడ్మిషన్లు మాత్రమే తీసుకుంటున్నారు. విద్యాబోధన మాత్రం చేయట్లేదు. నగర శివారులోని ఓ కళాశాల ఉత్సవ విగ్రహంలాగా తయారైంది.
నిబంధనలు పాటించాల్సిందే..
బీఈడీ కళాశాలలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతిసారి కోర్టు అనుమతితో అడ్మిషన్లు పొందడం సరైంది కాదు. ప్రతి కళాశాల నిబంధనలు పాటిస్తేనే అనుమతి ఇస్తాం. లేదంటే మేము కూడా కోర్టును ఆశ్రయించి నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకుంటాం.
– చంద్రశేఖర్, తెయూ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్
చర్యలు తీసుకోవాలి
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బీఈడీ కళాశాలలపై యూనివర్సిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రతి విద్యా సంవత్సరం తనిఖీలు చేస్తున్నారు. గాని ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. బీఈడీ విద్యపై రూ. లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత వర్సిటీ అధికారులపై ఉంది.
– జన్నారపు రాజేశ్వర్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి