VC: కోర్సుల్లో కొత్త సిలబస్.. ఉద్యోగ అవకాశాలు లభించేలా..
ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థుల ఉజ్వల భవితతో పాటు ఉపాధి లక్ష్యంగా కోర్సులు, సిలబస్ రూపకల్పన జరగాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 2023–24 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ఇంటిగ్రేటెడ్ టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రొగ్రాం డిజైన్, అండర్ గ్రాడ్యుయేషన్ కామన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమీక్ష సమావేశాలు మంగళవారం నిర్వహించారు. జాతీ య నూతన విద్యా విధానం–2020ను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాలన్నారు. ఐటీఈపీ కోర్సు నాలుగేళ్లు ఉంటుందని అన్నారు.
చదవండి: JNTU Anantapur: జేఎన్‌టీయూ ప్రొఫెసర్ ప్రశాంతి పరిశోధనకు పేటెంట్
మొదటి ఏడాది సర్టిఫికెట్ కోర్సు, రెండో ఏడాది డిప్లమా కోర్సు, మూడో ఏడాది డిగ్రీ, నాలుగో ఏడాది డిగ్రీ బీఎడ్ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది బీఎస్సీ బీఎడ్‌లో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, బీఏ బీఎడ్‌లో చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రంలతో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లలో 7, 8 సెమిస్టర్లలో బీఎడ్ సిలబస్ ఉంటుందన్నారు. డిగ్రీలో ఇంటర్న్‌షిప్ అమలు తప్పనిసరని వివరించారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్, విద్యారంగ నిపుణలు గంటా రమేష్, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, డాక్టర్ ఎస్.ఉదయ్‌భాస్కర్, డాక్టర్ చింతాడ రాజశేఖర్‌రావు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ పీలా సుజాత, అకడమిక్ అఫైర్స్ అసి స్టెంట్ డీన్ డాక్టర్ నీలం సంతోష్ రంగనాఽథ్ పాల్గొన్నారు.