Tanvika Reddy: మూడేళ్ల చిన్నారికి గౌరవ డాక్టరేట్
Sakshi Education
పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతకు తగ్గట్టు మూడేళ్ల చిన్నారి విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకుని అబ్బురపరిచింది.
తమిళనాడు రాష్ట్రంలోని పళ్లిపట్టులో తెలుగు కుటుంబానికి చెందిన శ్రీనివాసులురెడ్డి, రూపారెడ్డి దంపతుల కుమార్తె తాన్వికారెడ్డి (3) చిన్నతనం నుంచే ఏదైనా గుర్తుపెట్టుకుని చెప్పేది. తల్లి చిన్నారి టాలెంట్‌ను గుర్తించి జనరల్ నాలెడ్జ్‌పై శిక్షణ ఇచ్చింది. ఈ క్రమంలో మదురైలోని తమిళ్ యూనివర్సిటీ, కామరాజ్ యూనివర్సిటీ సంయుక్తంగా అద్భుత మేధోశక్తి కనబరిచిన వారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న మూడేళ్ల తాని్వకారెడ్డి 8 నిమిషాల్లో పండ్లు, దేశాలు, ఖండాలు, నదులు, వివిధ దేశాల కరెన్సీ, కలర్స్ సహా 50 విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్పింది. దీంతో యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్, సర్టిఫికెట్‌తో సత్కరించారు.
Published date : 07 May 2022 01:05PM