Skip to main content

Sadimeka Lalitha: డాక్టర్‌ పట్టా అందుకున్న గిరిజన మహిళ

బెజ్జూర్‌: మండలంలోని కుకుడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ సడిమెక లలిత ఓయూలో పీజీ, ఎంఏ తెలుగు పూర్తిచేసింది.
tribal woman with a doctorate degree

దేశవ్యాప్తంగా నిర్వహించే అధ్యాపక పరీక్ష కోసం యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌ సెట్‌కు అర్హత సాధించింది. ఈమె హైదరాబాద్‌లోని తెలంగాణ సరస్వతి పరిషత్‌ ప్రశ్యా కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది.

చదవండి: Free Corporate Education: ప్రతి పేద విద్యార్థికి ఉచితంగా కార్పొరేట్‌ విద్య.. ఏక్కడ..?

ఉస్మానియా ఓరియంటల్‌ తెలుగు విభాగంలో డాక్ట ర్‌ అజ్మీర సిల్మానాయక్‌ పర్యవేక్షణలో ‘పరిణితవాని ప్రసంగాలు–సాహిత్య, సాంస్కృతిక అధ్యయనం’అనే అంశంపై పరిశోధన పూర్తి చేసింది. ఇందుకుగాను సెప్టెంబ‌ర్ 15న‌ ఆమెకు డాక్టరేట్‌ పట్టా అందుకుంది. పట్టా అందుకున్న ఆమెను తల్లిదండ్రులు పార్వతి–శంకర్‌, మండల ప్రజలు అభినందించారు.

Published date : 16 Sep 2024 03:44PM

Photo Stories