Chancellor Connects Alumni: వర్సిటీలతో గవర్నర్ సమావేశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ‘చాన్స్‌లర్ కనెక్ట్స్ అల్యూమినీ’ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సెప్టెంబర్ 25న రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధికారులు, ప్రముఖ విద్యావేత్తలతో సమావేశమవుతారు.
రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 9.30 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలపై గవర్నర్ వర్సిటీ అధికారులతో చర్చించనున్నారు.
చదవండి: Devireddy Sudheer Reddy: ఉపాధ్యాయుల పాత్ర గొప్పది
సుదీర్ఘ కాలంగా పెద్ద సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో చాలా వర్సిటీల్లో పలు రకాల కోర్సులు మూతబడడం, ఫీజులను అడ్డగోలుగా పెంచడం, తరగతుల నిర్వహణ జరగకపోవడం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని వర్సిటీల్లో గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు జరగకపోవడం, రాజకీయాలతో వర్సిటీల పాలన వ్యవహారాలు పూర్తిగా గాడి తప్పడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Published date : 25 Sep 2023 04:23PM