ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థికి కరాటే పోటీలలో బంగారు పతకం

గోవాలో మార్చి 29 నుంచి 31 వరకు జరిగిన ఈ పోటీలలో 20కు పైగా ఆసియా దేశాలు పాల్గొన్నాయి. దాదాపు తొమ్మిది. రౌండ్లలో ప్రత్యర్థులను మట్టికరిపించడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్.అలివేలు మంగమ్మ మాట్లాడుతూ, రవితేజ ఈ ఘనత సాధించడం ద్వారా తమ కళాశాల ఖ్యాతి మరింత పెరిగిందన్నారు.
చదవండి: విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి కార్యశాల నిర్వహించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల
విద్యార్థులు చదువులతో పాటుగా క్రీడలలో రాణించడం అభినందనీయమని, ఇది తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. కళాశాల ఫిజికల్ డైరక్టర్ డా. వినోద్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించడంలో కళాశాల ఎప్పడూ ముందుంటుందని, వారికి తగిన ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు. పోటీ వివరాలను ఆయన తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. భవాని, అధ్యాపకులు డా. శ్రీనివాస రావు, డా. దయానంద్ ఆర్య, డా. సి.వి.పవన్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: NCERT: కొత్త పాఠ్య పుస్తకాలు ముద్రణ .. ఇన్ని భాషల్లో..