విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి కార్యశాల నిర్వహించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల
మొత్తంగా ఆరు రోజులపాటు సాగినటువంటి ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ తో పాటు ఇంటర్ పర్సనల్ స్కిల్స్, వారికి ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి కావాల్సినటువంటి మెలకువల గురించి వక్తలు వివరించడం జరిగింది. కార్యక్రమం చివరి రోజు అయిన మార్చి 16న కళాశాల ఆవరణ లో విద్యార్థులు ఏర్పాటు చేసినటువoటి స్టాల్స్ పలువురిని ఆకట్టుకున్నాయి.
చదవండి: TS Exams: ఏప్రిల్ అంతా పరీక్షా కాలమే... తెలంగాణలో ఏయే ఎగ్జామ్ ఎప్పుడెప్పుడంటే
విజయవంతంగా కోర్సును పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ గారు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అలివేలు మంగమ్మ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ భవాని, రసాయన శాస్త్ర విభాగాధిపతి, NSS యూనిట్-2 సమన్వయకర్త డాక్టర్ ఐ.వాని, అధ్యాపకులు డాక్టర్.పి.వినోద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఇంటర్, డిగ్రీ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ అమలుపై సందేహాలు