గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ అడ్మిషన్స్ ఫెయిర్
నగరంలోని సుల్తాల్ ఉల్ ఉలూమ్ కళాశాలలో ఉదయం 11 గంటలకు కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ , ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్, సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి జాఫర్ జావీద్‌తో కలిసి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ప్రారంభిస్తారు. ప్రపంచంలోని 45కు పైగా విశ్వవిద్యాలయాలు ఈ ఫెయిర్‌లో పాల్గొంటాయి.
చదవండి: Study Abroad Career Opportunities: విదేశీ విద్యకు స్కాలర్‌షిప్ చేయూత
విద్యార్థులు తమ విదేశీ విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఏజెన్సీల నుంచి స్కాలర్ షిప్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా పొందవచ్చు. ఫెయిర్‌లో పాల్గొనదలచే విద్యార్థులు https://www.edmat.org/event/284లో జనవరి 27 సాయంత్రం 6 గంటల వరకు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఫోన్ నం. 9841244500ను సంప్రదించవచ్చు.
చదవండి: National Overseas Scholarship: విదేశీ విద్యకు ఆర్థిక చేయూత.. ఎంపిక విధానం ఇలా..