Skip to main content

Medical: వైద్య సీట్లపై గెజిట్‌ నోటిఫికేషన్

పీజీ వైద్య విద్య సీట్లు, పీజీ దంత వైద్య సీట్ల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత నిచ్చింది.
వైద్య సీట్లపై గెజిట్‌ నోటిఫికేషన్
వైద్య సీట్లపై గెజిట్‌ నోటిఫికేషన్

ఈ మేరకు గతంలో ఉన్నవాటికి సవరణలు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అక్టోబర్‌ 22న ఉత్తర్వులిచ్చారు. ప్రతిభ కలిగిన రిజర్వుడు అభ్యర్థులు (ఎంఆర్‌సీ) ఎవరైనా ఓపెన్ కేటగిరీలో సీటు పొంది ఆ సీటును స్లైడ్‌ కావడం కానీ, వేరే ఇతర కారణాల వల్ల కోర్సు మారడం చేస్తే ఆ సీటును అదే రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు ఇస్తారు. స్లైడ్‌ అయిన కాలేజీలో గానీ, కోర్సులో గానీ ఎంఆర్‌సీ అభ్యర్థి జాయిన్ కాకపోతే వదులుకున్న ఆ సీటును ఓపెన్ కేటగిరీ అభ్యర్థితో భర్తీ చేస్తారు. అదే తొలుత వదిలేసిన (ఓపెన్ కేటగిరీ సీటును రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థి వదిలేసిన) సీటుకు అదే కేటగిరీ అభ్యర్థి రాకపోయినా మళ్లీ మళ్లీ అదే కేటగిరీ అభ్యర్థితోనే భర్తీ చేయాలి. ఉదాహరణకు సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో ఓపెన్ కేటగిరీ కింద సీటు పొందిన ఎస్సీ అభ్యర్థి స్లైడ్‌ అయి ఆంధ్రా మెడికల్‌ కాలేజీకి వెళ్తే సిద్ధార్థ సీటు ఎస్సీ కేటగిరీ అభ్యర్థితోనే భర్తీ చేయాలి. ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో రెండోసారి కూడా అభ్యర్థి చేరకపోతే ఆ సీటును ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. మొదట వదిలేసిన సిద్ధార్థ కాలేజీ సీటుకు రెండోసారి కూడా రిజర్వుడ్‌ అభ్యర్థి రాకపోయినా ఆ సీటును అదే కేటగిరీ అభ్యర్థితో భర్తీ చేయాల్సిందే. 

చదవండి: 

Jobs: విద్యాశాఖలో పోస్టుల భర్తీ

Degree: డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు నిలుపుదల ఉత్తర్వులు పొడిగింపు

Published date : 23 Oct 2021 03:09PM

Photo Stories