Degree: డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు నిలుపుదల ఉత్తర్వులు పొడిగింపు
Sakshi Education
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపును అక్టోబర్ 23 వరకు నిలుపుదల చేస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు నవంబర్ 1 వరకు పొడిగించింది.
ఈ వ్యవహారంలో ఒకటి రెండు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి న్యాయవాది చెప్పిన విషయాన్ని రికార్డ్ చేసిన హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లను కన్వీనరే భర్తీ చేస్తారంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాయలసీమ డిగ్రీ కాలేజ్ అసోసియేష¯ŒS హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
చదవండి:
హైదరాబాద్‌లో సైతం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసాం: ఆచార్య వై.నజీర్
Published date : 22 Oct 2021 04:02PM