పాఠశాల విద్యాశాఖలో కొత్తగా 5,823 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.
విద్యాశాఖలో పోస్టుల భర్తీ
ఈ మేరకు తెలంగాణ ఆర్థికశాఖ అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలకు 937 పోస్టు గ్రాడ్యుయేట్ రెసిడెన్షియల్ టీచర్ల పోస్టులు, ఆదర్శ పాఠశాలలకు 307, ఒకేషనల్ ట్రైనర్లు ఒకేషనల్ కో–ఆర్డినేటర్లు 1,435, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలకు 2,343, ప్రభుత్వ ఎంఈడీ కళాశాలలకు 211 బోధనా సిబ్బంది పోస్టులను తాజాగా మంజూరు చేసింది.