Tenth Board Exams 2025 : మార్చి 17 నుంచి బోర్డు పరీక్షలు.. టెన్త్ విద్యార్థులకు ఉచిత సౌకర్యం..

సాక్షి ఎడ్యుకేషన్: ఏపీలో టెన్త్ విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరాకుండా, వారి పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఏపీ ఆర్టీసీ విద్యార్థులకు ఒక మంచి వార్త చెప్పింది. ట్రాఫిక్ ఎక్కడైనా ఎక్కువగానే ఉంటుంది. పరీక్షల సమయంలో విద్యార్థులు ట్రాఫిక్‌లో ఉంటే పరీక్షకు సమయానికి చేరుకోలేరు.
AP Model Schools 6th Class Admission 2025: ఆదర్శ పాఠశాలల్లో దరఖాస్తుకు ఇదే చివరి తేదీ
విద్యార్థులు.. ఈ ట్రాఫిక్ రద్దీ, దూర ప్రాంతాల్లో ఉండే పరీక్ష కేంద్రాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. దీంతో, విద్యార్థులు సకాలంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రానికి సమయంలోగా చేరుకుంటారు. ఇలా అయితే, పరీక్ష రాసే సమయంలో, కేంద్రానికి చేరే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుంది.
6.49 మంది..
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ఏపీలో పదో తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఇక, ఈ పరీక్షలకు మొత్తం 6.49 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
Intermediate Admissions 2025: మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
ఇక మొత్తం 3450 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించే ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో, క్లాస్ రూముల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.
బస్సుల ఏర్పాటు..
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులను ఏర్పాటు చేశారు. కానీ, ఇందులో మాత్రమే పదో తరగతి విద్యార్ధులను టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణానికి అనుమతిస్తారు. ఇందులో టికెట్‌లు తీసుకోవడం ఉండదు కానీ, విద్యార్థులు వారి హాల్‌టికెట్లను చూపించాల్సి ఉంటుంది.
అలాగే, పరీక్ష పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే సమయంలో కూడా ఇలాగే తమ హాల్ టికెట్లను చూపిస్తే సరిపోతుంది. రాష్ట్ర విద్యాశాఖతో పాటు ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు చేయనున్నారు.
విద్యార్థులు పరీక్షలు ప్రారంభమై పూర్తి చేసుకునే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు అధికారులు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ap tenth board exams
- public exams arrangements
- free buses for tenth students
- ap tenth public exams facilities
- free bus arrangement
- AP education department
- ap tenth students
- tenth board exams 2025 latest updates
- march 17th
- board exams 2025
- ap tenth board exams hall tickets download 2025
- ap tenth halltickets download
- Education News
- Sakshi Education News