Skip to main content

Fire Dept: విద్యాశాఖకు శాఖకు ఫైర్‌ సర్వీస్‌ లింక్‌

సాక్షి, సిటీబ్యూరో: విద్యా సంస్థలకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) క్రాస్‌ వెరిఫికేషన్‌ చేసుకోవడానికి ఆ శాఖ అధికారులకు మార్గం సుగమం కానుంది.
Fire Dept
విద్యాశాఖకు శాఖకు ఫైర్‌ సర్వీస్‌ లింక్‌

ప్రస్తుతం ఉన్న విధానంతో జాప్యం జరుగుతుండటంతో తెలంగాణ‌ అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ వై.నాగిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌ఓసీలకు సంబంధించి తమ వద్ద ఉండే డేటాబేస్‌కు సంబంధించిన లింకు ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వనున్నారు. దీని వినియోగంపై వారికి ప్రాథమిక శిక్షణ కూడా ఇప్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చదవండి: School Education Department: ఉచిత విద్యకు ఇంత మంది విద్యార్థులు ఎంపిక

ఆ భవనాలకు అగ్నిమాపక శాఖే..

ఏదైనా భవనాన్ని నిర్మించిన తర్వాత దాన్ని అందు బాటులోకి తెచ్చే ముందు ఫైర్‌ సేఫ్టీ మెజర్స్‌కు సంబంధించి ఎన్‌ఓసీ తీసుకోవడం అనివార్యం. 15 మీటర్ల లోపు ఎత్తున్న నివాస, 18 మీటర్ల లోపు ఉన్న వాణిజ్య భవనాలకు జీహెచ్‌ఎంసీ అధికారులే వీటిని జారీ చేస్తారు. ఈ ఎత్తు దాటితే ఎన్‌ఓసీ జారీ బాధ్యత అగ్నిమాపక శాఖకు వెళ్తుంది. గడిచిన కొన్నేళ్లుగా ఫైర్‌ సర్వీస్‌ అధికారులు రెండు దశల్లో వీటిని జారీ చేస్తున్నారు. భవన నిర్మాణం ప్రారంభానికి ముందు ప్రొవిజినల్‌, నిర్మాణం పూర్తయిన తర్వాత ఫైనల్‌ ఎన్‌ఓసీలను ఈ విభాగం జారీ చేస్తుంది. విద్యా సంస్థలకు సంబంధించిన భవనాల విషయంలో ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. ఈ భవనాలు మొదటి అంతస్తుకు మించితే కచ్చితంగా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకుని ప్రతి యేటా రెన్యువల్‌ చేయించుకోవాలి.

చదవండి: ఈ విద్యార్థులకు విశాఖలో నీట్, జేఈఈ శిక్షణ కేంద్రం

రెండేళ్ల గడువు ముగియడంతో..

విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఫైర్‌ సేఫ్టీ మెజర్స్‌ను పూర్తి స్థాయిలో సవరించింది. నిబంధనలు కఠినతరం చేస్తూ అందుబాటులో ఉండాల్సిన ఉపకరణాల సంఖ్యనూ పెంచింది. వీటిని తక్షణం అమలు చేయాలంటూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావాలతో కుదేలైన విద్యా సంస్థల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కొంత గడువు కోరారు. దీంతో రెండేళ్ల వరకు పాత నిబంధనలే వర్తిస్తాయని, ఆపై మాత్రం కచ్చితంగా సవరించిన మేరకు ఫైర్‌ సేఫ్టీ మెజర్స్‌ ఉండాలని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ గడువు ముగియడంతో త్వరలో ప్రారంభంకానున్న విద్యా సంవత్సరానికి ఆ శాఖ అధికారులు ఆయా సంస్థల అనుమతులు రెన్యువల్‌ కావాలంటే.. అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ తప్పనిసరి.

చదవండి: World's Top Universitiesల్లో మన యూనివర్సిటీలు

Published date : 29 May 2023 05:28PM

Photo Stories