Students Education : నాణ్యమైన విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు..
అనంతపురం: ‘‘విద్యాశాఖ పనితీరు మెరుపడాలి. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా బోధన, కార్యక్రమాలు ఉండాలి. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి. ‘నేను బడికిపోతా’ కార్యక్రమం ద్వారా చేపట్టిన నమోదు ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలి’’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మనం అందించే విలువైన ఆస్తి విద్య అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
FREE Coaching for Group 1: గ్రూప్ 1 మెయిన్స్‌కు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నాణ్యమైన విద్యను అందిస్తేనే ఉజ్వల భవిష్యత్తును ఇవ్వగలమన్నారు. కేజీబీవీల్లో 10వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, ఉత్తీర్ణత పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ‘నేను బడికి పోతా’ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అన్ని మండలాల్లోనూ కార్యక్రమం పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు. బడిబయట ఉన్న పిల్లలను మొత్తం 3,356 మందిని గుర్తించగా, ఇందులో 1,617 మంది ఉరవకొండలోనే గుర్తించారని, మిగిలిన మండలాల్లో ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు.
Anganwadis: అంగన్‌వాడీల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
పిల్లలతో ఎక్కడా పని చేయించకూడదని చెప్పారు. జ్ఞాన జ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎస్‌జీటీలకు, అంగన్‌వాడీ టీచర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. జ్ఞాన ప్రకాశ్ రిఫ్రెషర్ కింద శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు కిట్ల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పీఎంశ్రీ స్కూల్స్‌కు సంబంధించిన పనులు ఏ స్థితిలో ఉన్నాయనే దానిపై నివేదిక అందించాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజన పథకం ఆగకూడదు
జిల్లాలోని 1,694 పాఠశాలల్లో 1,87,954 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలవుతోందని, ఏ కారణం చేత కూడా ఏ ఒక్క పాఠశాలలోనూ మధ్యాహ్న భోజన పథకం ఆగకూడదన్నారు. ఏదైనా సమస్య వస్తే 24 గంటల్లో పరిష్కరించాలని డీఈఓ వరలక్ష్మిని ఆదేశించారు. విద్యాశాఖలో కేడర్ వారీగా అధికారుల స్థాయి నుంచి వాచ్‌మెన్ వరకు ఉన్న ఖాళీల వివరాలను అందించాలని ఆదేశించారు. ప్రతి నెల 15వ తేదీలోగా బిల్లులు సమర్పించాలని, ఆలస్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో విద్యాశాఖ ఏడీలు కృష్ణయ్య, నాగరాజు, ఏఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎంఓ గోపాల్, జీసీడీఓ వాణిదేవి, తదితరులు పాల్గొన్నారు.
‘నేను బడికిపోతా’ నమోదు పూర్తి కావాలి' విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం
Staff Nurse Counselling : స్టాఫ్ నర్స్‌ల కౌన్సెలింగ్ నిలిపివేతపై అభ్యర్థుల ఆందోళన..!
Tags
- School Students
- Education quality
- Students Future
- Education Schemes
- new govt
- deo vinod kumar
- Nenu Badiki Pota program
- new schemes for school education
- quality of education for students
- Education Department
- Education News
- Sakshi Education News
- Anantapur Education
- quality education
- school attendance
- registration process
- education reform
- SakshiEducationUpdates