Degree Admissions: ‘దోస్త్’ గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దోస్త్ ఆన్‌లైన్ రిపోర్టింగ్ గడువును మళ్లీ పెంచారు.
విద్యాసంస్థలకు వరుసగా రెండు రోజులు సెలవులు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కాలేజీ విద్యా కమిషనర్ వాకాటి కరుణ జూలై 27న ప్రకటించారు. మూడో దశ డిగ్రీ ప్రవేశాలకు జూలై 28 తుది గడువు కాగా, దీన్ని 31 వరకూ పెంచినట్లు పేర్కొన్నారు. ఈ తేదీలో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు.
చదవండి:
Fine Arts Career After Inter: ఫైన్ ఆర్ట్స్‌తో కలర్‌ఫుల్ కెరీర్
What After Inter HEC: హెచ్‌ఈసీ విద్యార్థులకు విభిన్న కోర్సులు, వినూత్న కెరీర్ అవకాశాలు ఇవే..
Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!
Published date : 28 Jul 2023 11:47AM